Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 5:31 pm Posted by : ramakrishna

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

  • సిపిఐ జిల్లా కార్యదర్శి  పి.సుధాకర్

 

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : భారత కమ్యూనిస్టు పార్టీ- సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం పులాంగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక అసమానతల నిర్మూలన కోసం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి చేశారని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు,ప్రాథమిక విలువలతో పాటు సమానత్వాన్ని పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడం పాలకుల విధి అని అన్నారు. దేశంలో హిందువులపై పట్టుకోసమే ప్రస్తుతం బిజెపి వక్ఫ్ సవరణ చట్టం తెచ్చిందని అన్నారు. దేశంలో నిరుద్యోగం రోజు,రోజు పెరుగుతుంటే హిందూ,ముస్లిం పేరుతో విభజన తెచ్చి కేంద్రంలో ఉన్న మోడీ కాలయాపనచేస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు కమలాపురం, రాజన్న,పి.రంజిత్, రాజు పాల్గొన్నారు.