ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

బోధన్, బతుకమ్మ : బోధన్  విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని పీఆర్ఠీయూ భవన్లో విద్యార్థి సంఘా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు విద్య రంగ సమస్యలపై అనేక విషయాలను చర్చించారు. ముఖ్యంగా బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల వేధింపు ఎక్కువైందని దోపిడి కి హద్దు అదుపు లేకుండా పోయిందని అన్నారు. ఫీజుల దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సూచించారు. ఫీజులు చెల్లించుటకు కట్ ఆఫ్ డేట్ లని పెట్టి విద్యార్థులకు వేధించడం సమంజసం...