Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 5:34 pm Posted by : ramakrishna

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

బోధన్, బతుకమ్మ : బోధన్  విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని పీఆర్ఠీయూ భవన్లో విద్యార్థి సంఘా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు విద్య రంగ సమస్యలపై అనేక విషయాలను చర్చించారు. ముఖ్యంగా బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల వేధింపు ఎక్కువైందని దోపిడి కి హద్దు అదుపు లేకుండా పోయిందని అన్నారు. ఫీజుల దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సూచించారు. ఫీజులు చెల్లించుటకు కట్ ఆఫ్ డేట్ లని పెట్టి విద్యార్థులకు వేధించడం సమంజసం కాదని అన్నారు. స్కాలర్షిప్, రియాబర్స్మెంట్ రాలేదని క్లాస్ రూమ్ లో నుండి బయటకు పంపడం చేస్తే ఏమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు. ప్రవేట్ విద్యాసంస్థల్లో ఫీజులో దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అండ ఉన్నదని మాకు ఎవరు ఏమి చేయలేరని కొందరు విద్యాసంస్థల యాజమాన్యాలు విర్రవీగుతున్నాయని వారిని చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బోధన్ లో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అలాగే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్  భవనాల అద్దె బిల్లులు చెల్లించాలని, పక్క భవనాలను నిర్మించాలని ,పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని తదితర అంశాలపై ఉద్యమ కారాచరణకి తీర్మానించారు. విద్యారంగ సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నాగరాజు, గౌతమ్ కుమార్, సంజయ్, సాయికుమార్, మౌనిక మోసిన్, సంతోష్, రాజేందర్, బాలరాజు రాజన్న, జనార్దన్, శ్రీకాంత్, సతీష్, నరేష్, ప్రతాప్, నరేందర్, వామపక్ష నాయకులు శంకర్ గౌడ్, వరదయ్య పాల్గొన్నారు.

Let's protest against the extortion of fees by private educational institutions.