ఆర్మూర్, బతుకమ్మ: దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ల ఆదేశాలతో చేపూర్ పల్లె. గ్రామాలలో నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు గురువారం పాదయాత్ర చేస్తు వాడ వాడకు వెళ్లి కరపత్రాలు పంచారు.స్థానికంగా ఉన్న మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్ టి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి .డిసిఎంఎస్ మాజీ చైర్మన్.మండల ఇంచార్జీ మునిపెళ్లి సాయి రెడ్డి. గురువారం మండలంలోని చేపూర్. పల్లె (హరిపూర్) గ్రామాలలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్రం మంత్రి అమిత్ షా వాక్యాలు అహంకారపూరితమైనవని ఆయన పేర్కొన్నారు అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మారా చంద్రమ్మోహన్ మాట్లాడుతూ కేంద్రమంత్రి తీరుతో పాటు రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న బిజెపి కుట్రలను ప్రజలకు ఈ యాత్ర ద్వారా తెలియపారు అంతేకాక రాష్ట్ర ప్రజపాలన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు క్షుణంగా వివరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటి చిన్నారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమిద్దమని. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను మనం కాపాడుకుందాంమని గాంధీ అంబేద్కర్ లాంటి మహానీయుల గురించి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పదో పట్టిస్తున్న ఇతర పార్టీ మాటలను తిప్పి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు రెండు గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్. రామ్సన్. ఉపాధ్యక్షులు చిట్యాల పోసెట్టి. జోరీగ ధర్మయ్య. మాజీ ఉప సర్పంచ్ కటికే శ్రీనివాస్ సొసైటీ మాజీ డైరెక్టర్ సారంగీ శాంతి కుమార్. క్రిస్టియన్ మైనారిటీ మండల అధ్యక్షుడు కంపదండి వినోద్ న్యాయవాది చరణ్. దేవరాజ్. కొంపల్లి సుధాకర్. సాయ గౌడ్. కటికే లక్ష్మమన్ అది సంతోష్. శంకర్ తదితరులు పాల్గొన్నారు.