బతుకమ్మ, మోర్తాడ్: భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని జిల్లా సెక్రెటరీ గిర్మాజీ గోపి అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్ డోన్ పాల్ వడ్డాట్ గాండ్లపేట్ గ్రామాల్లో గురువారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నాలుగు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలను , భారత రాజ్యాంగం పుస్తకం చేత పట్టుకుని పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు భూమన్న మైపాల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.