…. నేషనల్ హైవే పిడి మాధవి
బతుకమ్మ, పిట్లం :
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటుదామని పిలుపుమేరకు మంగళవారం నాడు ధర్మారం టోల్గేట్ వద్ద పీడి మాధవి మొక్కలు నాటారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ స్వచ్ఛతే హై సేవ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకరం చుట్టారు. నేషనల్ హైవే రోడ్డు రవాణా సంస్థ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి పిలుపుమేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకాకం చూ ట్టాము అన్నారు. మొక్కలు ఎలాగైతే నాటుతున్నామో వాటిని సంరక్షించే బాధ్యత కూడా నేషనల్ హైవే సిబ్బందిపై ఉన్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వహించి వాటికి నీళ్లు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఆమె కోరారు. నేషనల్ హైవే పై ప్రమాదాలు ఎక్కువ అవుతున్న అని ఆమె దృష్టికి తీసుకెళ్లగా హైవేపై ప్రమాదకరంగా మూలమలుపులు ఉన్నచోట స్పీడును తగ్గించి వెళ్లాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశామని అలాగే ధర్మారం టోల్ గేట్ వద్ద రెండు అంబులెన్స్లు రెండు క్రేన్లు ఉంటాయని వాటిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి ప్రసంగాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూసిన తర్వాత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ అక్తర్, రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ రాజశేఖర్, రాజశేఖర్, టోల్ ప్లాజా సిబ్బంది ఉన్నారు
