మహానీయుల స్పూర్తితో ముందుకు సాగాలి
నిజామాబాద్, బతుకమ్మ : మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని ఇన్ చార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ అన్నారు. మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో నిర్వహించిన ఈ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి...