Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 6:08 pm Posted by : ramakrishna

12వ వార్డు ను ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుకుందాం

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు ఎన్నికల ప్రచారంలో తన దూకుడును పెంచారు. సీమ, రమేష్ శేట్కార్ ఈ సందర్భంగా శనివారం వార్డు లో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. మహిళలు వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి సీమ, రమేష్ శేట్కార్ కు హారతులతో స్వాగతం పలికి తమ బిడ్డగా కుంకుమతో విజయతిలకాన్నీ దిద్దారు. తమ బిడ్డను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వార్డు ప్రజలు తెలిపారు. ప్రజలకు సేవ చేసిన కుటుంబం లో నుంచి వచ్చి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవకు పని చేసే నాయకురాలిగా పేరు సంపాదించుకున్నారని మరో ఐదేళ్లపాటు 12వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా  తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని వారిపై పూర్తి నమ్మకం ఉన్నట్లు ప్రజలు తెలిపారు. ఈ సారి అవకాశం కల్పించి మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తు పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.