Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 9:38 pm Posted by : ramakrishna

లోక్ అదాలత్ కు సమాయావత్తు అవుదాం

 

. . . జిల్లాజడ్జి భారత లక్ష్మీ

 

. . . న్యాయసేవ సంస్థ భాగస్వాములతో సమావేశం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జాతీయ న్యాయసేవాధికార సంస్థ నాల్సా ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ ను మార్చి 28 న నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తన భాగస్వాములతో మంగళవారం జిల్లా కోర్టు సముదాయంలోని సమావేశపు హల్ లో సన్నాహక సమావేశం నిర్వహించింది. సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి ఎన్ భారత లక్ష్మీ భాగస్వాములనుద్దేశించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు గురుతరమైన బాధ్యతలను అప్పగించిందని సామాజిక బాధ్యతగా సమాజంలో నెలకొని ఉన్న కొన్ని రకాల వైరుద్యాలను పౌరుల మధ్య నుంచి తొలగించి సామరస్య వాతావరణాన్ని నెలకొల్పవలసి ఉన్నదని ఆమె తెలిపారు. మనుషులం అన్నాక వైషమ్యాలు ఉన్నాయని అవి దీర్ఘాకాలం కొనసాగడం వ్యక్తులకు, వ్యవస్థకు నష్టదాయకామేనని అన్నారు. క్షణిక ఆవేశమో, కక్షలో, ఈర్షలో మానవ మెదడులో తిష్టవేసి కొన్ని నేరాలకు పురి కొల్పుతాయని అవి చాలా మట్టుకు రాజీకి వీలు ఉన్నవే అయి ఉంటాయని, వాటిని రాజీపద్ధతిన పరిష్కరించి చూపడమే మనమంతా చేయాల్సిన మహత్తర కార్యక్రమమని ఆమె పేర్కొన్నారు. రాజీపడదగిన చాలా క్రిమినల్ కేసులను రాజీ చేయడం మూలంగా ప్రజా సమూహల మధ్య శాంతియుత వాతావరణాన్ని సృష్టించిన వారం కాగలమని ఆమె అన్నారు. వివాదాలతో లాభం లేదనే విషయాలు కక్షదారుల మధ్యకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత న్యాయసేవ సంస్థ భాగస్వాములపైనే ఉన్నాయని ఆమె తెలుపుతూ ఆ దిశగా మన కార్యాచరణ ఉండాలని ఉపదేశించారు. సమాజంలో పోలీసులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తారని ప్రజలందరితో పరిచయాలు ఉంటాయాని ఆ పరిచయాలతో కొంత మంది ప్రజలను న్యాయసేవ సంస్థ వైపు నడిపించగలనే నమ్మకం ఉన్నదని ఆమె అన్నారు. లోక్ అదాలత్ అంటే తెలుగులో ప్రజా న్యాయపీఠమని ఒకప్పుడు రాజుల కాలంలో ధర్మ పీఠం వైపు ప్రజలు కదిలినట్లు నేడు ప్రజాపీఠాల వైపు న్యాయార్థులను కదిలించే అడుగులు సంస్థ భాగస్వాములవి కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ ఆశించారు. న్యాయవాదులతో మొన్ననే సన్నాహక సమావేశం నిర్వహించినట్లు వారు జాతీయ లోక్ అదాలత్ కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారని అన్నారు. న్యాయసేవ సంస్థకు భాగస్వాముల బలమే దిక్సూచిగా వెళుతున్నామని ఆ వెలుగులో న్యాయసేవల ప్రస్థానం కొనసాగాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Let's make time for Lok Adalat.

 

అదనపు జిల్లాజడ్జిలు హరీష్, శ్రీనివాస్ మాట్లాడుతూ నాల్సా లక్ష్యానికి అనుగుణంగా వెళుతు జాతీయ లోక్ అదాలత్ లక్ష్యాన్ని సాధించడానికి కారకులమవుదామని అన్నారు. అందరి లక్ష్యం మార్చి 28 పైనే ఉండాలని ఉమ్మడిగా కలిసి నడుస్తూ న్యాయసేవ సంస్థ భాగస్వాముల బలాన్ని చాటి చెపుదామని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి పోలీసు శాఖ తరపున మునుపటిలాగే మరింత బలంగా నిలబడి జాతీయ లోక్ అదాలాత్ విజయానికి శ్రమిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, ప్రకాష్ యాదవ్, జూనియర్ సివిల్ జడ్జిలు చైతన్య, హరి కుమార్, డిప్యూటీ డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మి నర్సయ్య, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బూసారపు రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.