నిజామాబాద్ ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుద్దాం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుద్దామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం నగరంలోని మారుతీనగర్ లో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నారు. కుల, మతాలకు అతీతంగా...