Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 4:50 pm Posted by : ramakrishna

ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుకుందాం

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు ఎన్నికల ప్రచారంలో తన దూకుడును పెంచారు. గైని యాదవ్ ఈ సందర్భంగా ఆదివారం వార్డు లో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. వార్డ్ కౌన్సిలర్ గైని యాదవ్ కు హారతులతో స్వాగతం పలికి తమ ఇంటి పెద్ద కొడుకు గా కుంకుమతో విజయతిలకాన్నీ దిద్దారు. తమ కొడుకు ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వార్డు ప్రజలు తెలిపారు. ప్రజలు మెచ్చిన కుటుంబం లో నుంచి వచ్చి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవకు పని చేసే నాయకుడి గా పేరు సంపాదించుకున్నారని మరో ఐదేళ్లపాటు 1వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని ఆయన పై పూర్తి నమ్మకం ఉన్నట్లు ప్రజలు తెలిపారు. ఈ సారి అవకాశం కల్పించి మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Let's make it an ideal ward.