డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి . జిల్లా కేంద్రంలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు . మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, నిరంతర నిఘా సారించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ...