Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2024, 5:11 pm Posted by : ramakrishna

రతన్ టాటా స్ఫూర్తి తో సమాజ సేవలో ముందుందాం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రముఖ వ్యాపారవేత్త, స్వర్గీయ రతన్ టాటా స్ఫూర్తితో సమాజ సేవలో ముందుండి పని చేయాలని టాటా ఏ ఐ ఏ నిజామాబాద్ బ్రాంచ్ ఉద్యోగులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ ప్రెస్ క్లబ్ సమీపంలో రతన్ టాటా స్మారక సభ, మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ టాటా ఏ ఐ ఏ బ్రాంచ్ ఉద్యోగులు మాట్లాడుతూ రతన్ టాటా ఆయన చేసిన సేవల గురించి ఆయన సాధించిన విజయాలను గురించి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువే అని, ఆయన విధానం ఆయన దాతృత్వం వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి ఎనలిని దని అన్నారు. సేవా రంగంలో ఆయన చూపిన దార్శనికత ఆయనలో ఉన్నటువంటి మానవతా కోణం ఇవన్నీ ఆయనని ఈ భారత సమాజంలో చిరస్మరణీయుని చేశాయి అన్నారు. అలాగే దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రకృతి విలయాలు సంభవించిన, కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు దేశాన్ని కుదిపేసిన నేనున్నానంటూ స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ని స్థాపించి దాని ద్వారా ఆయన సంపాదనల నుంచి 66% ఈ దేశ పౌరుల అభ్యున్నతికి సంక్షేమానికి వెచ్చించమని చెప్పిన ఒక గొప్ప మానవతా శిఖరం మన రతన్ టాటా అని అన్నారు. కార్యక్రమంలో హబీబ్ మియా, ప్రసాద్ రెడ్డి, సాయిరాం పవిత్ర, శారద, సిరిపురం రవీందర్, భవాని తదితరులు పాల్గొన్నారు.