విద్యా రంగంలో జిల్లాను అగ్రభాగాన నిలుపుదాం

ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిజామాబాద్, బతుకమ్మ : ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ నిజామాబాద్ జిల్లాను విద్యా రంగంలో అగ్రభాగాన నిలుపుదామని నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేయాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం...