జాతీయ లోక్ అదాలత్ కు సన్నద్దమవుదాం
ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజాహితమే ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్న ప్రజా న్యాయపీఠాలను విజయవంతం చేయడానికి సన్నదమవుదామని ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గ అన్నారు. దిశంబర్ 14 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా కోర్టు ప్రాంగణంలోని కోర్టులతో పాటు ఆర్మూర్, బోధన్ కోర్టులలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. న్యాయవాదులు,పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది తో కూడిన సన్నాహక సమావేశంలో ఆమె ప్రసంగించారు.న్యాయ వివాదాలను ఎదుర్కొంటున్న న్యాయార్ధుల అభిమతం మేరకు సివిల్ దావాలను,రాజీపడదగిన క్రిమినల్...