Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 9:19 pm Posted by : ramakrishna

చదువుకు దూరమైన పిల్లలను బడిలో చేర్పిద్దాం

  • జీయూపీఎస్ హెచ్ఎం సోడి కృపాల్ సింగ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఈఓ ఆదేశాల మేరకు జీయుపీఎస్ బర్కత్‌పురా పాఠశాల హెచ్ఎం, పాఠశాల సిబ్బంది బడి బాట కార్యక్రమం లో భాగంగా చదువుకు దూరమైన పిల్లలను బడిలో చేర్పించాలనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు వారి పిల్లల భవితకు పునాదులని తెలియజేస్తూ పాఠశాలలో పిల్లలను చేర్పించారు. ఈ సందర్భంగా సోడి కృపాల్ సింగ్ మాట్లాడుతూ, విద్య అనేది ఒక సామాజిక అవసరం, మనుగడను సాధించేందుకు విద్య యొక్క పాత్ర అమూల్యమైనదని, అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య పిల్లల జీవితం లో వెలుగులు నింపగలదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఏఏపీసీ సభ్యులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.