Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 4:02 pm Posted by : ramakrishna

ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం

  • డిటిఓ శ్రీనివాస్ రెడ్డి
  • జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో ఎన్ హెచ్ 44 టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారులపై అధికమరణాల రేటు పరిగణలోకి తీసుకుంటే ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతపై వారం రోజుల జాతీయ ప్రచారం జరుగుతుందని డి టి ఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడేందుకు రోడ్డు భద్రత చర్యలు ప్రోత్సహించేందుకు వార్షిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు సీటు బెల్టు, హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలోఎంవీఐ బిక్షపతి, నాగలక్ష్మి, అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Let's follow traffic rules.. Let's avoid road accidents