పసుపునకు మద్దతు ధరకోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదాం
ఎమ్మెల్సీ కవిత మార్కెట్ యార్డులో పసుపు పరిశీలన నిజామాబాద్, బతుకమ్మ : పసుపునకు మద్దతు ధరకోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదామని రైతులకు ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డులో పసుపును ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఈసందర్భంగా పసుపు రైతులు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. పసుపుకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు వాపోయారు. ప్రతి ఏడాది శివరాత్రి వేళ పసుపు ధర పెరుగుతుండగా వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను తగ్గిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవలేడం రైతులు ఎమ్మెల్సీ కవితకు తెలిపారు....