Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 February 2025, 11:22 am Posted by : ramakrishna

పసుపునకు మద్దతు ధరకోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదాం

ఎమ్మెల్సీ కవిత

మార్కెట్ యార్డులో  పసుపు పరిశీలన

నిజామాబాద్, బతుకమ్మ : పసుపునకు మద్దతు ధరకోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదామని రైతులకు ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో  మార్కెట్ యార్డులో  పసుపును ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఈసందర్భంగా పసుపు రైతులు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. పసుపుకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు వాపోయారు. ప్రతి ఏడాది శివరాత్రి వేళ పసుపు ధర పెరుగుతుండగా వ్యాపారులు సిండికేట్ గా  మారి ధరను తగ్గిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవలేడం రైతులు ఎమ్మెల్సీ కవితకు తెలిపారు. పసుపు బోర్డు ప్రకటించిన జిల్లాకు ఒరిగేందేమి లేదని రైతులు పేర్కొన్నారు. మహారాష్ట్రలో పసుపుకు ఉన్న ధర ఉన్న జిల్లాలో రావడం లేదని రైతులు వెల్లడించారు.

Let's fight with the central government for support price for turmeric