Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 5:23 pm Posted by : ramakrishna

కేంద్ర ప్రభుత్వ మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

 

. . . పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షలు వాసరి సాయినాథ్

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

కేంద్ర ప్రభుత్వ మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, యుద్ధోన్మాద దాడులకు వ్యతిరేకంగా అమరవీరులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల పోరాట స్ఫూర్తితో పోరాడాలని  పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షలు వాసరి సాయినాథ్ అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 95 వ వర్ధంతి సందర్భంగా సోమవారం డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో ఏఐకెఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవస్వామి, సతీష్, నర్సయ్య, హుసేన్, తదితరులు పాల్గొన్నారు.