Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 8:20 pm Posted by : ramakrishna

మోడీ మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం

 

. . . పీడీఎస్ యు నిజామాబాద్ నగర అధ్యక్షులు ఎండి.నసీర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిజానికి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో నేటి విద్యార్థి, యువత ఉద్యమించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నగర అధ్యక్షులు ఎండి.నసీర్ అన్నారు. పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో భారత జాతీయోద్యమ వీరులు కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి స్మారక వారోత్సవాల (మార్చి 23 నుండి 30 వరకు) సందర్భంగా మంగళవారం బాలుర హాస్టల్ లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు బ్రిటిష్ సామ్రాజవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని సైతం లెక్కచేయకుండా ప్రాణాలర్పించిన షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల పోరాట స్ఫూర్తి విద్యార్థి, యువతరం హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయిందని గుర్తు చేశారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల పోరాట పూర్తితో ఉద్యమించి, వారు కలలుగన్న కుల, మత, అసమానతలు లేని సంపూర్ణ సమానత్వ సమాజాన్ని స్థాపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు ప్రధాన కార్యదర్శులు ఆర్.వినోద్ కుమార్, నగర సహాయ కార్యదర్శి అల్గోట్ సృజన్, వీరేంద్ర, విక్కీ, అజయ్, శ్రీకర్, శ్రీనివాస్, అభిషేక్, ఆస్లామ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.