Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 10:39 pm Posted by : ramakrishna

తిందాం . . . తాగుదాం . . . మార్పుతెద్దాం

 

. . . రెడ్ క్రాస్ ఎన్నికలలో తీరు

 

నిజామాబాద్ , బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ ఎన్నికల ప్రచారం ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న సమయంలో కొత్త పుంతలకు తావిస్తుంది. రెడ్ క్రాస్ ఎన్నికలలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక కమిటీ కొత్తగా ఒక వ్యూహరచన చేసింది. స్వచ్ఛంద సంస్థకు స్వచ్ఛందంగా ఓట్లు వేసే ఓటర్లను మభ్యపెట్టేందుకు గ్రామాల వారీగా కొందరు ఓటర్లను ఒకటిగా చేసి, కొంతమంది ఓటర్లకు కలిపి విందు, మందు ఏర్పాట్లను చేసింది. ఓటర్ మహాశయుల దగ్గర నుండి ఓట్లు రాబట్టేందుకు కొత్తగా  ఆలోచన చేస్తున్నారు. అందుకు ఓటర్ మహాశయులు ప్రతి ఓటరు ఒక ప్యానెల్ నుండే వచ్చింది. మరి ఒక ప్యానల్ నుండి మాకు ఎటువంటి విందు మందు ఏర్పాటు జరగలేదని ఆశించే తరుణంలో, మరికొందమంది ఓటర్లు అవగాహన కలిగిన విద్యావేత్తలైన ఓటర్లు విందు, మందు ఒకరి వద్ద నుండి తీసుకొని ఆనందం పొంది, ఎన్నో సంవత్సరాలుగా నిర్వహించకపోయినా పాత విధానాలకు చరమగీతం పాడుతూ ఎన్నికలతో నూతనంగా కమిటీని ఎన్నుకుందాం అని, వారిచ్చిన విందు మందును స్వీకరించి మార్పును ఎట్టి పరిస్థితుల్లో వచ్చేంతవరకు ముందుంటామని ఓటర్లు హామీ ఇస్తున్నారు. ఒక కమిటీ నుంచి వచ్చిన విందు మందు ను స్వీకరించి , రెడ్ క్రాస్ సంస్థ పైన ఆసక్తి చూపుతున్న విద్యావేత్తలకు అవగాహన పరులకు పట్టం కట్టేందుకు సిద్ధంగానే ఉంటామని, విందు మందులకు లొంగే ప్రసక్తే లేదని ఓటర్ గా నిక్కచ్చిగా చెబున్నారని, విందు మందుతో విద్యావేత్తలను కోనుగోలు చేయలేరు అని, తిందాం… తాగుదాం…  రెడ్ క్రాస్ ఎన్నికలలో మార్పుతెద్దాం… అని విద్యావేత్తలు, ఓటర్లు , అవగాహన పరులు సూచిస్తున్నారు.