బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద రాజకీయాలను ఎండగడదాం

తెలంగాణలో మతసామరస్యాన్ని కాపాడుకుందాం  సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కే.రమ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద రాజకీయాలను ఎండగట్టాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కే.రమ పిలుపునిచ్చారు.  సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ అర్బన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం కోటగల్లిలో గల పద్మశాలి భవన్ లో నిర్వహించారు. ముందుగా సుత్తి, కొడవలి జెండాను జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర...