కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మిద్దాం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, అదే యాదగిరన్నకు నిజమైన నివాళి అవుతుందని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ర్ట కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఆదర్శ కమ్యూనిస్టు, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరి ప్రథమ వర్ధంతి సభను పార్టీ అర్బన్, రూరల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్, వెంకటేశ్వర కళ్యాణ మండలంలో  నిర్వహించారు. ముందుగా పార్టీ శ్రేణులు కామ్రేడ్ యాదగిరన్న,...