అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిద్దాం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విప్లవద్యమంలో అమరులైన వారికి స్మరిస్తూ సీపీఐఎంల్ మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా హాజరైన పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రత్యేకించి 58 ఏళ్ల భారత కమ్యూనిస్టు విప్లవద్యమంలో ప్రజల కోసం ఈ దేశంలో ప్రజాతంత్ర, సోషలిస్టు విప్లవం కోసం పోరాడి...