మోర్తాడ్, బతుకమ్మ: కలిసిత రహిత నిర్మాణంలో భాగంగా మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల తయారీ పోటీలు నిర్వహించడం జరిగింది. హానికరమైన రంగులతో కూడిన గణపతులకు బదులుగా మట్టితో తయారుచేసిన గణపతులను ప్రతిష్టించవలసిందిగా గ్రామ పెద్దలను విద్యార్థులను ఆయన కోరారు. పాఠశాలలో విద్యార్థులు సొంతగా మట్టి గణపతులను తయారు చేశారు. పోటీ పడి తయారుచేసిన గణపతుల ప్రతిమలలో మొదటి ద్వితీయ స్థానాలు నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.