Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2025, 8:08 pm Posted by : ramakrishna

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

  • ఎస్సై విక్రమ్ ఆధ్వర్యంలో మోర్తాడ్ లో 2 కే రన్
  • విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు

 

మోర్తాడ్, బతుకమ్మ : డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో మోర్తాడ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం డ్రగ్స్ పై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో 2కే రన్ నిర్వహించబడింది. అనంతరం పాఠశాల, జూనియర్ కాలేజీ విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం, యువతలో మత్తు పదార్థాల ముప్పు గురించి అవగాహన కల్పించి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రోత్సహించడం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజల నుండి మంచి స్పందన లభించింది. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పటిష్టంగా కొనసాగుతాయ ఎస్ఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయి రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్యామ్, పోలీస్ సిబ్బంది పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Let's build a drug-free society.