Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 7:39 pm Posted by : ramakrishna

సైగలతో మాటల మూటలు విప్పుకునే దివ్యాంగులకు అండగా నిలుద్దాం

 

. . . సీనియర్ సివిల్ జడ్జి నీలిమ

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ

మాటలు రానివారు, చెవులు వినబడని వారికి పౌర సమాజం తోడుగా నిలబడాలని నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ముద్దసాని నీలిమ కోరారు. నిజామాబాద్ నగరంలోని పాంగ్ర బోర్గంలోని గ్రేసీ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంటల్ సర్వీసెస్ కార్యాలయం గ్రీన్ బిల్డింగ్ లో దివ్యాంగుల కోసం నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.మాటల మూటలను సైగలతో విప్పుకునే వారికి న్యాయసేవ సంస్థ అండగా నిలబడుతుందని తెలిపారు.చెవులు వినబడుకున్న ఎదుటివారు చేసే చర్యలతో వాటి అర్థాన్ని అర్థం చేసుకుని నడుచుకునే నేర్పరితనం వారికి ఉంటుందని అన్నారు. మూగ వారి సైగలలోని పరమార్థాన్ని పసిగట్టి మసలుకునే తెలివితేటలూ వారి సొంతమని ఆమె పేర్కొన్నారు. దివ్యాంగులకు సేవ చేసుకునే మహాభాగ్యం న్యాయసేవ సంస్థకు లభించడం చిరస్మరణీయంగా నిలిచి పోతుందని జడ్జి నీలిమ అన్నారు. ఇ ఎన్ టి వైద్యుడు రజనీకాంత్, జనరల్ మెడిసిన్ డాక్టర్ సంజీవ్, డాక్టర్ శివాని, వీరస్వామి లు మాట్లాడుతూ పిల్లల దగ్గరికి న్యాయసేవ సంస్థతో కలిసివచ్చి వైద్యసేవలు అందించడం మరచిపోలేని జ్ఞాపకాలుగా ఉంటాయని అన్నారు.ఎల్లవేళలా ఇలాంటి మంచి కార్యక్రమాలకు చేదోడుగా నిలబడతామని వారు తెలిపారు. గ్రేసీ చైర్ పర్సన్ జ్యోతి కార్యక్రమానికి వచ్చిన అందరికి అభివాదాలు తెలిపారు.