సాయుధ పోరాట స్ఫూర్తితో తిరగబడదాం

రుద్రూర్, బతుకమ్మ : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తిరగబడదామని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ పిలుపునిచ్చారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవం నిర్వహించి, అమరవీరులకు కొవ్వొత్తుల ప్రదర్శనతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ, ఆనాటి నిజాం నవాబు ప్రభుత్వం ప్రజలపై శిస్తుల పేరుతో దోపిడీ చేస్తే, ఈనాటి నరేంద్ర మోడీ ప్రభుత్వం జీఎస్టీ...