Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 12:37 pm Posted by : ramakrishna

చెట్లను చుట్టాలుగా చేసుకుందాం . . . మంచి మర్యాదాలు చేద్దాం

. . .ప్రకృతి పరిరక్షణతోనే..మానవళి రక్షణ

 

. . . నాల్సా “నాటుమన్నది మొక్కలను.. చేయుమన్నది చెట్లను

 

.  . . ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుగాలి నారాయణ

 

నిజామాబాద్ , బతుకమ్మ : 

 

చట్టాలు ఎన్ని ఉన్నా వాటిని చుట్టాలుగా మలుచుకుని మంచి మర్యాదాలు చేయాలని నిజామాబాద్ ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుగాలి నారాయణ అన్నారు. ప్రపంచం పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలను నాటిన అనంతరం మాట్లాడారు. పర్యావరణ హితం కోసం మొక్కలను నాటి నీటిని పోసి, మొక్కలకు రక్షణనివ్వడంలో మనుషుల మంచి మర్యాదాలు ఇమిడి ఉన్నాయని ఆయన తెలిపారు.పర్యావరణ పరిరక్షణతోనే మానవళి రక్షణగా ఉంటుందని దానిని గుర్తేరిగి మసలుకోవాలన్నారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నాల్సా మొక్కలను నాటి ప్రకృతికి తోడ్పాటును అందించమన్నదని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలను సంరక్షించి చెట్లుగా మలచాలని అవి తిరిగి పౌర సమాజానికి అన్ని రకాల మేలు చేస్తాయని అన్నారు.చెట్లను దైవాలుగా కొలుస్తామని, చెట్లను ప్రాణప్రదంగా కాపాడుకుంటే ప్రాణ వాయువులను అందిస్తాయని ఆయన అన్నారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను ప్రతి పౌరుడు ప్రాథమిక విధిగా బావించాలని అన్నారు. ప్రతి గల్లిని, గ్రామాన్ని చిట్టడవులుగా తయారు చేసుకోవాలని బార్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి అన్నారు.జూనియర్ సివిల్ జడ్జిలు చైతన్య అంగరి,వడ్డి హరి కుమార్, పాముజుల శ్రీనివాస్ రావు , బార్ ఉపాధ్యక్షుడు ఆవుల నారాయణ రావు మొక్కలను నాటారు. కార్యక్రమంలో న్యాయవాదులు మాణిక్ రాజు, ఆశ నారాయణ, రవి ప్రసాద్,జిల్లాకోర్టు ముఖ్య పరిపాలన అధికారి గోవింద్ రావు, న్యాయసేవ సంస్థ సూపరింటెండెంట్ శైలజ రెడ్డి, జ్యూడిషియల్ ఉద్యోగులు జ్యోతి, లింగారెడ్డి, అంజల్ రెడ్డి, ఎనిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.