Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2025, 8:31 pm Posted by : ramakrishna

కామ్రేడ్ నాయక్వాడ్ నరసన్న స్ఫూర్తితో ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం

  • సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కామ్రేడ్ నాయక్వాడ్ నరసన్న స్ఫూర్తితో ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్మిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ పిలుపునిచ్చారు. కామ్రేడ్ నాయక్వాడ్ నర్సయ్య సంస్మరణ సభ నిజామాబాద్ కాలూరు గ్రామంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ మాట్లాడుతూ పేద ప్రజలను దోపిడీ చేసి కార్పొరేట్ పెట్టుబడిదారులకు దేశ వనరులను ప్రభుత్వాలు కట్టబెడుతున్నారని , హక్కుల కోసం , దోపిడీ వ్యవస్థ మార్పు కోసం కామ్రేడ్ నర్సన్న పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి పిలుపునిచ్చారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్యా మాట్లాడుతూ కామ్రేడ్ నరసయ్య రైతులను ఏకం చేసి అనేక రైతంగ ఉద్యమాలు నిర్మించాడని, నిజం సాగర్ ఉద్యమంలో సింగూర్ నీళ్ల కోసం జరిగిన ఉద్యమంలో  సారంగపూర్ చక్కర ఫ్యాక్టరీ నీ కాపాడుకోవడం జరిగిన ఉద్యమంలో నర్సన్న ముందున్నాడనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, కాలుర్ గ్రామ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కత్తుల సాయిలు.మల్లేష్, సైదులు, సాయిలు, న్యూడెమోక్రసీ నగర నాయకులు రమేష్,సత్యం,శివకుమార్, మల్లికార్జున్,అన్వేష్, మరియు కాలూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Let us build united mass movements with the spirit of Comrade Naikwad Narasanna