మోర్తాడ్, బతుకమ్మ:గత 58 సంవత్సరాల నుండి భారత కమ్యూనిస్టు విప్లవద్యమంలో ప్రజల కోసం ఈ దేశంలో ప్రజాతంత్ర సోషలిస్టు విప్లవం కోసం పోరాడి ఎందరో ప్రాణాలర్పించారని సంతాప సభకు సంయుక్త మండల కార్యదర్శి జి కిషన్ అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం సిపిఐ ఎంఎల్ ప్రజా పంత మాస్ లైన్ మోర్తాడ్, ఏర్గట్ల సంయుక్త మండలాల ఆధ్వర్యంలో అమరవీరుల సంతాప సభ నిర్వహించారు. భూమికోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం పోరాడి అమరులైన వీరులందరికీ నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి ఈ సందర్భంగా రాయల రవన్న డివి కృష్ణ అన్న యాదగిరి అన్నల ఫోటోలకు దండలేసి నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో మండల నాయకులు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ గంగ పోసాని, రాములమ్మ, పద్మా, రెడ్డి, సాయన్న, ఎర్రక్క, తదితరులు పాల్గొన్నారు.
