Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 7:16 pm Posted by : ramakrishna

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

 

. . . అదనపు కలెక్టర్ భుజంగరావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఐదేళ్ళలోపు  పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మాణానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయాలన్నారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లాలో ఎంతమంది చిన్నారులు ఉన్నారు ? అవసరమైన డోసుల వాక్సిన్ అందుబాటులో ఉందా అని ప్రోగ్రామ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

 

Let us build a polio-free society.