కోర్టు కేసుల పరిష్కారంలో మరింత చేయూతనివ్వండి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బార్ అండ్ బెంచ్ సమన్వయంతో కక్షిదారులకు మెరుగైన న్యాయసేవలు అందించడం జరుగుతున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు మరింత శ్రమిస్తే కక్షిదారులకు న్యాయఫలాలు మరిన్ని అందించడానికి అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించిన ఆమె న్యాయవాదుల సమావేశంలో మాట్లాడారు. కోర్టుల ద్వారా సత్వర న్యాయాన్ని ఆశిస్తున్న న్యాయార్ధుల ఆశలకు అనుగుణంగా కష్టిద్దామని అన్నారు.న్యాయవ్యవస్థ పనితీరులో పారదర్శకత ఎంతో ఉన్నదని,దానిని కాలానికి...