Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 11:20 am Posted by : ramakrishna

శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం

తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గంలో 500 మెట్టు దగ్గర చెట్లపొదల్లో సేదతీరుతూ చిరుత కనిపించింది. గమనించిన భక్తులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఇచ్చిన భక్తులు. ఈక్రమంలో సిబ్బంది సైరన్‌ మోతతో చిరుతను తరిమేశారు.  అంతకు ముందు శ్రీవారి మెట్టు మొదట్లో చెకింగ్ పాయింట్ వద్ద భక్తులను అనుమతించలేదు. తిరిగి అరగంట తర్వాత వారిని బృందాలుగా పంపారు.