ఎల్లారెడ్డి మండలంలో చిరుత సంచారం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో. చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. చిరుత పులి దాడిలో మూడు మేకలు హతమయ్యాయి. మండలంలోని అన్నాసాగర్ గ్రామ శివారులోని నల్లకుచ్చ వద్ద సోమవారం చిరుత పులి దాడి, బద్దరపు రవీందర్ కు చెందిన రెండు మేకలు, బడ్డారపు సురేందర్ కు చెందిన నాలుగు మేకలు కనిపించకుండా పోయాయి. ఫారెస్ట్ లో వెతుకగా ఒక మేక దొరికిందని, మూడు హతం కాగా రెండు మేకల ఆచూకీ లభ్యం కాలేదని బాధితులు ఆవేదన...