Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 2:34 pm Posted by : ramakrishna

అవాలగావ్ శివారులో చిరుత పులి సంచారం

మద్నూర్, బతుకమ్మ :  మద్నూర్ మండలం అవాల్ గావ్ గ్రామ శివారులో గురువారం చిరుత పులి సంచరించిన ఆనవాళ్లను రైతులు చూశారు.  దీంతో  భయభ్రాంతులకు గురైన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటన స్థలానికి వెళ్లి  చిరుతపులి ఆనవాళ్లను  పరిశీలించారు. గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leopard roaming in the outskirts of Avalagaon