Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 8:01 pm Posted by : ramakrishna

నాగారం బీడి వర్కర్స్ కాలనీలో చిరుత సంచారం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని నాగారం బీడి వర్కర్స్ కాలనీ చిరుత సంచారం కలకలం రేపింది. ఇందూర్ నగరంలో అంగరంగ వైభవంగా ఊర పండుగ సంబరాలు జరుపుకుంటే  నాగారం 300 క్వార్టర్స్ ప్రజలు సాయంత్రం 6.55 నిమిషాల ప్రాంతంలో చిరుత పులి కనబడటంతో భయందోళనకు గురయ్యారు. స్థానికంగా  300  క్వార్టర్స్  వద్ధ వాటర్ ట్యాంక్ వద్ద కనబడంతో  ప్రజలు బిక్కుబిక్కుమంటున్న గడుపుతున్నారు. ఈ విషయంపై నిజామాబాద్ నార్త్ రెంజ్ ఫారెస్ట్ ఆఫిసర్ సంజయ్ గౌడ్ ను వివరణ కోరగా చిరుత సంచారం వాస్తవమని అన్నారు. ఆటవి శాఖ సిబ్బందిని స్థానికంగా అనవాళ్లు సేకరిస్తున్నామని తెలిపారు.