Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 August 2025, 2:10 pm Posted by : ramakrishna

మహంతం లో చిరుత  కలకలం

 

.. దూడను చంపేసిన చిరుత

 బతుకమ్మ, బోధన్ :

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లో మహంతం శివారులో శుక్రవారం రాత్రి జరిగిన చిరుత దాడి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. గ్రామ శివారులో పశువుల కొట్టంలో ఉన్న ఉన్న ఒక దూడను చిరుత చంపి తినిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న నవిపేట్ సెక్షన్ ఆఫీసర్ జహూర్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు.ఈ ఘటనపై స్పందించిన బాధిత రైతు లక్ష్మణ్, గ్రామస్తులు ఇటీవల చిరుత సంచారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత కోసం అటవీశాఖ బోన్లు  (కెమేరాలు, ట్రాప్‌లు) ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.అటవీశాఖ అధికారుల కథనం ప్రకారం, చిరుత సంచారం ఉందని తెలిపారు. అనుమానాలను ధృవీకరించేందుకు బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేయాలని త్వరలో చర్యలు చేపడతామని తెలిపారు.

Leopard in the mahantham villeage