రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి
మెదక్, బతుకమ్మ : గుర్తు తెలియని వాహనం ఢీ కొని చిరుత మృతి చెందిన ఘటన గంగాపూర్ శివారులో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా హవేలి ఘన్ పూర్ మండలం లోని గంగాపూర్ శివారులో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాపూర్, శమ్నాపూర్, లక్ష్మాపూర్, తొనిగండ్ల అటవీ ప్రాంతాల్లో చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆదివారం ఉదయం రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో అది అక్కడికక్కడే చనిపోయించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు,...