Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 7:17 pm Posted by : ramakrishna

లేగ దూడపై చిరుత దాడి

 

దోమకొండ, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లాలో లేగ దూడపై చిరుత దాడి చేసింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దోమకొండ మండలం అంబారిపేట శివారులో చిరుత సంచారం చేసింది. స్థానికంగా శివారులో ఉన్న పశువుల కొట్టంలో ఉన్న లేగ దూడపై దాడి చేసి చంపేసింది. ఉదయం దాని యజమాని అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.