Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 7:28 pm Posted by : ramakrishna

దూడపై చిరుత పులి దాడి

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని తిమ్మాపూర్ గ్రామంలో రైతు చిమ్మ  సత్యనారాయణ దూడపై పులి దాడి చేసి ఆదివారం రాత్రి చంపేసిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రతిరోజు తన పొలం వద్ద బర్రెలను కట్టివేసి వస్తాడు. ఆదివరం రాత్రి రాత్రి 8 గంటల ప్రాంతంలో బర్రెలు కట్టేసి వచ్చాడు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో పొలంలోనికి  వెళ్లి చూడగా దూడ మరణించి ఉంది. ఈ విషయం ఫారెస్ట్ అధికారులకు తెలియ చేయడంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి చిరితపులి దాడి వల్ల మరణించినట్లు నిర్దారిచారు. ఈ సంఘటన అనంతరం తిమ్మాపూర్ గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.

Leopard attack on calf