చిరుత పులి కలకలం
మద్నూర్ బతుకమ్మ: మద్నూర్ మండలం లోని మేనూర్ జాతీయ రహదారి 161 మేనుర్ బైపాస్ లో రాత్రి రోడ్డుపై చిరుత పులి కూర్చోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అటువైపుగా వెళ్తున్న వాళ్లు చరవాణిలో చిత్రీకరించారు. గురువారం ఉదయం నుండి మద్నూర్ శివారులోని పరిసర ప్రాంతంలో రైతులకు కనిపించడంతో రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం నుండే చిరుత పులి కలకలం రేపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించినప్పటికీ చిరుత పులి పరిసర ప్రాంత ప్రజలను హడలెత్తిస్తుంది.