Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2025, 2:55 pm Posted by : ramakrishna

పంచాయతీరాజ్‌ సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం

వెబ్ న్యూస్, బతుకమ్మ  : పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును తెలంగాణ శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈసందర్భంగా బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. ఈబిల్లులో లేని అంశాలను సభ్యులు ప్రస్తావించారన్నారు. సభ్యులు ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు షెడ్యూల్ ఏరియాలో గుర్తించామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు.  స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించుకున్నామన్నారు.. కేంద్రం ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. ఈవిషయమై అన్ని పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాలని కోరారు.