Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 3:03 pm Posted by : ramakrishna

డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన శాసనసభ

డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్

సభలో సీఎం రేవంత్ రెడ్డి

వెబ్ న్యూస్, బతుకమ్మ : డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని తెలంగాణ శాసన సభ ఆమోదం తెలిపింది. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ. జనాభా నియంత్రణ శాపం కాకూడదని, జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నారు. పునర్విభజనకు.. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదన్నారు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతనే.. లోక్సభ సీట్ల పునర్విభజన చేయాలన్నారు. 2026 తర్వాత జనాభా లెక్కించి.. దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉండటంతో ఇది చర్చనీయాంశమైందన్నారు. డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్ అని వ్యాఖ్యనించారు. డీలిమిటేషన్తో 24 శాతం ఉన్న దక్షిణాది ఎంపీల సంఖ్య 19 శాతానికి పడిపోతుందన్నారు.  ఈవిషయమై ఏపీ, కర్ణాటక సీఎంలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, కేశవరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నామన్నారు.  అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.  డీలిమిటేషన్ వల్ల కలిగే నష్టాలను, భవిష్యత్తులో కేంద్రం నుంచి రావాల్సిన సహకారంపై చర్చించేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఇందుకు సహకరించాలన్నారు.