Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 4:49 pm Posted by : ramakrishna

రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు ని కలిసిన లెగ్గేల రాజు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు ని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి లెగ్గేల రాజు మర్యాద పూర్వకంగా కలిసారు. బుధవారం రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయంలో కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన సమాచార హక్కు చట్టం పలు అంశాలు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయలో సమాచార హక్కు చట్టం – 2005 బోర్డులు పెట్టడం లేదని, బోర్డులు ఉన్న చోట అధికారులు వివరాలు లేవని అన్నారు. సమాచార హక్కు చట్టం – 2005 కింద దరఖాస్తు చేస్తే 30 రోజులూ ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దరఖాస్తు దారుని పట్ల సరైన సమయానికి సరైన సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. తప్పుడు సమాచారం ఇస్తూ ఆర్టీఐ చట్టాన్ని కాలరాస్తున్నారని, రికార్డ్స్ లేవు రిజిస్టర్స్ లేవని, ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకునే దరఖాస్తు దారుని వివరాలు గోప్యంగా ఉంచాలి కానీ వారి వివరాలు అధికారులు అందరికీ తెలుసే విధంగా చేస్తున్నారని, చాలా మంది దరఖాస్తు దారులు రాష్ట్ర కమిషన్ వరకు రాలేక పోతున్నారని, ఆర్టీఐ చట్టాని నిర్వీర్యం చేసే విధంగా కాలరాసే విధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారికంగా ప్రతి మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించే విధంగా కమిషన్ ఈ విషయం పైన దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.