Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 10:55 am Posted by : ramakrishna

అందరికీ సత్వర న్యాయమే లీగల్ సర్వీసెస్ అథార్టీ ఉద్దేశం

 

. . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

 నిజామాబాద్ సిటీ బతుకమ్మ..

సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం అందించడమే లీగల్ సర్వీస్ అథారిటీ ముఖ్య ద్యేయం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తిసునీత కుంచాల పేర్కొన్నారు.  జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో  నవంబర్ 9 న లీగల్ సర్వీస్ డే పురస్కరించుకొని శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు న్యాయధికారులు, న్యాయవాదులు, పలు విద్యాసంస్థల విద్యార్థులతో కలిసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా జడ్జిజెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి సునిత కుంచాల మాట్లాడుతూ దీర్గా కాలికంగా కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వారికి సత్వర న్యాయం జరగడానికి లీగల్ సర్వీసెస్ అథార్టి ఓ చక్కని వేదిక అని అన్నారు. సమాజంలో ఉండే ప్రజలందరికీ న్యాయం చేయడానికి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. అదేవిధంగాన్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదులకు ఫీజులు చెల్లించని ఆర్థిక భారంతో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పేదవారికి లీగల్ అథారిటీ సర్వీసెస్ ఉచితంగా కేసులు వాదించడం జరుగుతుందన్నారు. సంవత్సరానికి మూడు లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి పూర్తిగా న్యాయ సేవాధికా సంస్థని ఓ న్యాయవాదిని ఏర్పాటు చేసికేసులు వాదించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా మహిళలందరికీ,ఎస్సీ ఎస్టీ వికలాంగులకు, కూడా లీగల్ సర్వీస్ ద్వారా ఉచితంగా కేసులు వాదించడం జరుగుతుందన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో  డిస్టిక్ లీగల్ సెల్ సర్వీసెస్ ప్రధాన కార్యదర్శిపద్మావతి, డి ఎల్ ఎస్ ఏ సూపర్ ఇండెంట్ శైలజ రెడ్డి, ఆర్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు ఆశ నారాయణ, రాజ్ కుమార్ సుబేదార్, మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Legal Services Authority aims at speedy justice for all