Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 5:08 pm Posted by : ramakrishna

లీగల్ సెల్ న్యాయవాదుల విజయోత్సవ సంబరాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బిహార్ రాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం లోని ఎన్ డి ఎ కూటమి ఘన విజయం సాధించడం పట్ల శుక్రవారం నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట  లీగల్ సెల్ న్యాయవాదులు  టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకుని ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమాత పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో 200 స్థానాలకు విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధికి  బీహార్ ప్రజలు బీజేపీ  మరొకసారి పట్టం కట్టారని తెలిపారు. బిజెపి పట్ల ప్రజల విశ్వాసాన్ని పొందినట్లుగా భావిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ ప్రజల  విశ్వాసాన్ని  పొందలేదని, అభివృద్ధిని ప్రజలు ఆకాంకించారని పేర్కొన్నారు. ఈ విజయం విహార్ ప్రజలకి అంకితం చేస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం దేశంలో దేశభద్రత, దేశ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ న్యాయవాదులు బిట్ల రవి,   వసంతరావు, మాణిక్ రాజ్, రుయాడి రాజేశ్వర్, సంతోష్, నాగ్, రేంజర్ల సురేష్, రంజిత్, సుతారి,  జయప్రకాష్, లోహియ మృత్యుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Legal Cell lawyers celebrate victory