- పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్
నవీపేట్, బతుకమ్మ : జూనియర్ మేడికో విద్యార్థిని ర్యాగింగ్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో జూనియర్ మేడికో విద్యార్థి పై సీనియర్ మెడికో విద్యార్థి ర్యాగింగ్ చేయడాన్నీ వ్యతిరేకిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని నవీపేట్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ.. డాక్టర్ వృత్తి అనేది సమాజంలో ఎంతో గౌరవప్రదమైనదని అటువంటి వృత్తిని నేర్చుకునే మేడికో విద్యార్థులు ఈ విధంగా తోటి విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ర్యాగింగ్ చేయడం, దాడులకు పాల్పడడం చాలా దుర్మార్గమన్నారు. తోటి విద్యార్థి పై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడినగానీ కళాశాల ప్రిన్సిపల్ ఇప్పటికీ వారి పైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. జూనియర్ మేడికో విద్యార్థి పై సీనియర్ విద్యార్థి దాడి చేశారని స్వయాన దాడికి గురి అయిన విద్యార్థి చెప్పడం దానికి వ్యతిరేకంగా కళాశాల అధికారులు ప్రవర్తించడం బాధాకరమన్నారు. గతంలో మేడికో విద్యార్థి మానసికంగా కృంగిపోవడంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనీ తెలిపారు. వెంటనే ర్యాగింగ్ చేసిన వారిపై దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులను కళాశాల అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా నాయకులు రెహానా,అజయ్, అన్వేష్, రెహానా, అనస్ తదితరులు పాల్గొన్నారు.