- సీఐ వెంకట్ నారాయణ
బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలో గణేష్ నిమజ్జనాలు సెప్టెంబర్ 4న రాకాసి పేట్, శక్కర్ నగర్ వద్ద ఏరియాలో జరగనున్నాయి. ఈ సందర్భంగా డీజే వ్యవస్థ డీజే వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు సీఐ వెంకట్ నారాయణ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సెప్టెంబర్ 6న బోధన్ పట్టణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పట్టణ పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. నిమజ్జన శోభాయాత్రల సమయంలో శాంతి భద్రతల కోసం పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. పట్టణ సిఐ వెంకటనారాయణ మాట్లాడుతూ, పోలీసుల సూచనలను అతిక్రమించి ఎవరైనా డీజే సిస్టమ్ వాడితే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సీఐ వెంకట్ నారాయణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను భక్తి భావంతో, సాంప్రదాయబద్ధంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసుల సూచనలకు సహకరించాలని కోరారు.